హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ కలకలం
హైదరాబాద్: నగర శివార్లలో చెడ్డీగ్యాంగ్(Cheddi Gang Hyderabad) కదలికలు కలకలం రేపాయి. నెక్నాంపూర్‌లోని(Neknampur) ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్ వద్ద భద్రతా ఏర్పాట్లను దాటుకుని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా టెన్షన్ సృష్టించింది. ఫెన్సింగ్‌ను కట్ చేసి అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించిన దొంగలు.. సీ-బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఫ్లాట్లలోకి చొరబడినట్లు సమాచారం. ఆరుగురు వ్యక్తులు కలిసి వచ్చినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో(CCTV footage) కనిపించినట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన తర్వాత విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. చోరీకి వచ్చిన దుండగుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో.. వారి ఆచూకీ కోసం పోలీసులు ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రాత్రివేళ అపార్ట్‌మెంట్ల భద్రతపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.