తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటలు!
03-11-2026 | 07:47am
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 14 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (Sarva Darshan) కల్పించేందుకు సుమారు 6 గంటల సమయం పడుతోంది.
నిన్న ఒక్కరోజే 67,300 మంది భక్తులు (Devotees) శ్రీవారిని దర్శించుకున్నారు. 22,380 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.4.04 కోట్ల ఆదాయం (Hundi Collection) సమకూరింది.