అభిరుచి గల ప్రేక్షకులిచ్చిన విజయం
పాయల్ చెంగప్ప(Payal Chengappa) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మయూఖ(Mayukha)’. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. శ్రీతేజ్ ఎస్‌కే దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేట్రికల్ రిలీజ్(Theatrical release)కు వచ్చిన ఈ సినిమా ట్రెండ్ సెట్టింగ్ థ్రిల్లర్‌గా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ చెంగప్ప మాట్లాడుతూ.. “ఇలాంటి కొత్త టీమ్‌కు పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్” అన్నారు. దర్శకుడు శ్రీతేజ్ మాట్లాడుతూ.. “నేను హనుమాన్ మాలలో ఉండే ఈ సినిమా ప్రమోషన్స్ చేశా. ఆయన శక్తే మా సినిమాను ముందుకు నడిపించిందని నమ్ముతున్నా. చిన్న సినిమా అని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ అభిరుచి గల ప్రేక్షకులు సక్సెస్ చేశారు” అని చెప్పారు.
నిర్మాత శశిధర్ నల్ల మాట్లాడుతూ.. “థియేటర్స్ దగ్గర పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్ నిలబడని పరిస్థితి చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మా టీమ్ అందరికీ ఈ విజయం గర్వకారణం” అని తెలిపారు. పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్, టాలీవుడ్ ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్లతోపాటు ఈ చిత్ర నటీనటులు రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ, దేవ్ డీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డీ గిరీశ్‌రెడ్డి, వీ5 ఎండీ వెంకటేశ్ కూడా మాట్లాడారు.