ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యే కథ

03-11-2026 | 05:25am

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్(Rahul Vijay, Archana Iyer) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అ’. సాయి బాలి దర్శకత్వంలో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కేతో కలిసి ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ నిర్మించారు. జాన్ విజయ్, సుధర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 12న ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమ వారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెం ట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ డైరెక్టర్ నందినీరెడ్డి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరో ఆకాశ్ పూరి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. “అ’ డార్క్ క్రైమ్ జానర్‌లో ఉంటుంది. ప్రేక్షకులకు ఒక్క నిమిషం కూడా బోరింగ్‌గా అనిపించదు.

కథ హీరోయిన్ చుట్టే తిరుగుతుంది” అని తెలిపారు. హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడుతూ.. “అ’ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ప్రతీ అమ్మాయికి కనెక్ట్ అయ్యే కథ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హంట్ చేసేలా ఉంటుంది” అని చెప్పింది. “స్టోరీ, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుంది” అని దర్శకుడు సాయి బాలి తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల, సహ నిర్మాత అభినవ్ కునపరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు