డ్రీమ్ రోల్ కోసం ఇంట్లో కూర్చోలేను!

03-11-2026 | 05:45am

అందాల భామ మానుషి చిల్లర్(Manushi Chhillar) ప్రస్తుతం బాలీవుడ్‌లో(Bollywood) నటిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా(Fashion Icon), ఎంటర్‌ప్రె న్యూర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకునేందుకు ప్రయత్ని స్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ముఖ్యంగా తాను ఇండస్ట్రీలో(Industry) తాను నేర్చుకున్న పాఠాల గురించి మాట్లాడుతూ.. “సినిమాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు అందరి సలహాలు వినేదాన్ని. కానీ అనుభవం పెరిగే కొద్దీ సొంత నిర్ణయాలే ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నాయి.

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్(Film background) లేనప్పుడు మన కోసం ప్రత్యేకంగా రోల్స్ రాసేవారు ఉండరు. అందుకే పర్ఫెక్ట్ డ్రీమ్ రోల్ కోసం ఇంట్లో కూర్చుని ఎదురుచూడటం కంటే, మనల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలను ఉపయోగించుకోవడమే ఉత్తమం. మిస్ వరల్డ్ విజయం అందించిన ఆర్థిక స్వేచ్ఛ వల్ల నటనపై ఎలాంటి ప్రెజర్ లేకుండా స్వేచ్ఛగా సినిమాలు ఎంచుకోగలు గుతున్నా” అని చెప్పుకొచ్చింది.

మానుషి ఇంకా విక్రాంత్ మాస్సేతో కలిసి నటించిన తన రాబోయే రొమాంటిక్ థ్రిల్లర్ ‘స్నాప్’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ముంబైలో నేను విన్న అత్యంత ఆసక్తికరమైన స్క్రిప్టుల్లో ఇది ఒకటి. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగుతూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’ అని తెలిపింది. 

మరిన్ని వార్తలు