రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత

26-11-2026 | 07:47pm

డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ 

ఖమ్మం, నవంబర్ 26(విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్య విలువలను,రాజ్యాంగ సంస్థలను కాపాడుకొనేందుకు ఏఐసిసి అద్యక్షులు(AICC President) మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభ ప్రతి పక్షనేత రాహుల్ గాంధీ ల(Rahul Gandhi) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సంవిధాన్ రక్షా మార్చ్ లో భాగంగా టిపిసిసి అద్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ కి జిల్లా లోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా,సత్తుపల్లి నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ర్యాలీకి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మండల పట్టణ అధ్యక్షులు, శ్రేణులతో కలిసి జెండా ఊపి ర్యాలీని  ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చారిత్రాత్మకమని,  రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలను ,ఎన్నికల వ్యవస్థను బలహీన పరుస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆయన విమర్శించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, పౌర హక్కులను కాపాడు కోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోత్ బాలాజీ నాయక్,

జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు సామినేని వెంకటయ్య, రంగా జనార్ధన్, పసుపులేటి దేవేందర్,కొమ్మినేని రమేష్ బాబు, గుడిపూడి బుచ్చిరామయ్య, పారుపల్లి విజయ్ కుమార్, కన్నెబోయిన గోపి యాదవ్, దర్జీ చిన్నారావు, మద్దినేని రమేష్, మూడుముంతల గంగరాజు యాదవ్, పుచ్చకాయల సోమిరెడ్డి, పసుపులేటి నాసరయ్య, ముళ్ళపాటి సీతారాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు