ఎల్లూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

26-11-2026 | 08:08pm

పెంచికల్‌పేట్, నవంబర్ 26 (విజయక్రాంతి): మండలంలోని ఎల్లూరు గ్రామంలో(Elluru Village) ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని(Rice purchasing center) సర్పంచులు చప్పిడి రవీందర్, షేక్ ఉస్మాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యంలో తేమశాతం 17 లోపు ఉండేలా చూసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుకిడే రాజేశ్వర్, ఏఈఓ శ్రీవిద్య, చప్పిడే సత్యనారాయణ, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు