రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులను విస్మరించవద్దు

26-11-2026 | 07:57pm

బోథ్. నవంబర్ 26 ( విజయక్రాంతి) భారత రాజ్యాంగం(Constitution of India) కల్పించిన హక్కులను విధులను సద్వినియోగం చేసుకొని భారత రాజ్యాంగం పట్ల గౌరవంగా జీవించాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ పిలుపునిచ్చారు. గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కొన్ని విధులను సైతం కల్పించిందన్నారు.

విధులను విస్మరించవద్దని రాజ్యాంగం హక్కులను విధుల పట్ల గౌరవంగా జీవించాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగాన్ని వ్రాయడం జరిగిందన్నారు. ప్రతి పౌరునికి ఉండే హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు అన్నారు. అయితే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులకు ఉపన్యాస ,వ్యాస, క్విజ్ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహుమతులు అందించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు