కురవి వీరభద్ర స్వామికి వెండి శఠగోపం, ప్లేట్ కానుక
29-11-2026 | 11:09am
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామివారికి భక్తులు వెండి కానుకలు (Silver Offerings) సమర్పించారు. మహబూబాబాద్‌కు చెందిన ఆదిమూలం రత్నకుమారి, మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు స్వామివారిపై భక్తితో రూ.లక్ష విలువైన వెండి శఠగోపం, ప్లేట్‌ను కానుకగా (Donation) అందజేశారు.
ఆదివారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు (Special Prayers) నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తితో సమర్పించిన వెండి కానుకలను ఆలయానికి అందజేశారు.