నారాయణపురంలో భూముల సర్వే

23-11-2026 | 04:12pm

కేసముద్రం, నవంబర్ 22 (విజయక్రాంతి): కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో(Narayanapuram village) జాయింట్ ఎల్ పి ఎం లో నమోదైన కుటుంబ సభ్యుల భూములను విభజించడానికి సోమవారం సర్వే నిర్వహించారు. గ్రామంలో ఇటీవల రైతులకు రీ సర్వే నిర్వహించి భూములకు పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ క్రమంలో కొందరికి భూమి మొత్తం ఒకరి పేరు నే నమోదు చేసి జాయింట్ ఎల్పిఎం ఇచ్చారు. దీనితో పలువురు కుటుంబ సభ్యులు తమకు గతంలో ఇచ్చిన విధంగానే పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనితో సోమవారం ఫిర్యాదులు వచ్చిన భూముల్లో సర్వేయర్ మురళి, ఆర్ఐ అనిల్ కుమార్, జిపిఓ బాలకృష్ణ ఆధ్వర్యంలోసర్వే నిర్వహించారు.

మరిన్ని వార్తలు