పొంగుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలు
13-09-2026 | 10:24am
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) వివిధ మండలాల్లో అతి భారీ వర్షాలు(Rains) కురవడంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రజా రవాణా స్తంభించిపోయింది. శనివారం నుండి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కేసముద్రం, నెల్లికుదురు, చిన్న గూడూరు మండలాల్లో అతి భారీ వర్షం కురిసింది. కేసముద్రంలో 216.8 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షం కురిసింది. అలాగే నెల్లికుదురులో 196.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఫలితంగా మహబూబాబాద్ నెల్లికుదురు రహదారిలో రావిరాల వద్ద వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. అలాగే పెద్ద ముప్పారం దంతాలపల్లి మార్గంలో వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.