రెండో రోజు బ్రిక్స్‌ సమావేశాలు.. మోడీ షెడ్యూల్ ఇదే

13-09-2026 | 11:39am

న్యూఢిల్లీ: రెండో రోజు బ్రిక్స్(BRICS Summit) శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. బ్రిక్స్ దేశాధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్వాగతం పలికారు. 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వినూత్న ఆవిష్కరణలు, పరస్పర సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచాభివృద్ధి సాధించే దిశగా నేతలు చర్చించనున్నారు. వివిధ అంశాలపై బ్రిక్స్ దేశాలతో భారత్ కీలక ఒప్పందాలు చేసుకోనుంది.

మధ్యాహ్నం నుంచి ప్రధాని షెడ్యూల్ ఇదే

మధ్యాహ్నం 2.30 గంటలకు కజకిస్తాన్ అధ్యక్షుడు టోకాయేవ్ తో, 3.00 గంటలకు ఫిలిప్పెన్స్ అధ్యక్షుడు మార్కోస్(Philippines President Marcos)తో, 3.30 గంటలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాతో, 4. సాయంత్రం 4.10 గంటలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో, 5.10 గంటలకు నైజీరియా ఉపాధ్యక్షుడు షెట్టిమాతో, సాయంత్రం 5.40 గంటలకు ఉగాండా ఉపాధ్యక్షుడు అలుపోతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.


మరిన్ని వార్తలు