భజన బృందానికి భజన
సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కళా సమితి అధ్యక్షులు లయన్ అశ్విని చంద్రశేఖర్
దేవరకద్ర అక్టోబర్ 23 విజయ క్రాంతి: ప్రతి ఒక్కరిలో భజన కార్యక్రమాలు(Bhajan programs) భక్తి భావాన్ని పెంపొందిస్తాయని సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కళా సమితి(Sadguru Sri Tyagaraja Swami Kala Samithi) అధ్యక్షులు లయన్ అశ్విని చంద్రశేఖర్ అన్నారు. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన భజన బృందం సభ్యులకు శుక్రవారం అశ్విని చంద్రశేఖర్ తన సొంత ఖర్చులతో భజన తాళాలను వితరణ గా అందించారు.
ఈ సందర్భంగా అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు భజన కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని అన్నారు. యాంత్రిక యుగంలో మనిషిలో ఒత్తిడిని , ఆందోళనలు దూరం చేసేందుకు భజనలు తోడ్పాడుతాయని శుక్రవారం నాడు అన్నారు. భజన కార్యక్రమాలు సోదర భావాన్ని , ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో భజన బృందం సభ్యులు రాజన్న గౌడ్, బి సాయిలు, చిన్నయ్య, బాల కొండయ్య, జంగ బుచ్చన్న, వాకిటి రాములు తదితరులు పాల్గొన్నారు.