ఘనంగా బతుకమ్మ సంబరాలు
16-10-2026 | 10:08pm
కోయిలకొండ : కోయిలకొండ మండల(Koilkonda Mandal) కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నవరాత్రుల సందర్భంగా దుర్గామాత సన్నిధిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను(Bathukamma) పేర్చి, ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి. కృష్ణయ్య, బి. రాములు, నవీన్తో పాటు గ్రామ యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.