ధాన్యం కొనుగోళ్లకు 183 కొనుగోలు కేంద్రాలు సిద్ధం
అదనపు కలెక్టర్ చెన్నయ్య
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి) : జిల్లాలో 2026–27 ఖరీఫ్ సీజన్(Kharif season) వరి ధాన్యం కొనుగోళ్లను(Paddy procurement) పిసిఎస్ఏపి పోర్టల్(PCSAP Portal) ద్వారానే నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ చెన్నయ్య(Additional Collector Chennaia) అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 183 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, టార్పాలిన్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.
గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461 కనీస మద్దతు ధరతో పాటు, ప్రభుత్వం గుర్తించిన ఏడుసన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందించనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను జియో ట్యాగింగ్ చేసి, వివరాలను యాప్ లో నమోదు చేయాలని, ధాన్యం రవాణా, నిల్వ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి రైతులకు సకాలంలో మద్దతు ధర అందేలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.