కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు

09-09-2026 | 06:18pm

భూత్పూర్: భూత్పూర్ మున్సిపాలిటీ(Bhoothpur Municipality) పరిధిలోని మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి(Municipal Chairman Drathrat Balakoti) ఆధ్వర్యంలో ఏడు, ఎనిమిదవ వార్డులకు చెందిన బిజెపి, బీఆర్ఎస్ నాయకులు,  కార్యకర్తలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudhan Reddy) సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం)లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరమన్నారు.

మున్సిపల్ చైర్మన్ బాలకోటి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం(Devarakadra Constituencyలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అభివృద్ధి కోసం ఆహార్నిశలు పనిచేస్తున్నారని, భూత్పూర్ మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ కదిరే శేఖర్ రెడ్డి, కో ఆప్షన్ అప్రోజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ పాషా, నర్సింలు, రమేష్, ముస్తాక్, సాబేర్, సైఫ్, శంకర్ నాయక్, ఆనంద్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు