విజయవంతంగా పూర్తయిన డ్రైన్ ఎండ్ సోక్ పిట్ నిర్మాణం

29-10-2026 | 10:06pm

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అభినందనలు

భూత్పూర్, అక్టోబర్ 29 : భూత్పూర్ మండల  పరిధిలోని మద్దిగట్ల గ్రామ పంచాయతీలో గ్రామ అభివృద్ధి(Village Development), పారిశుద్ధ్య రంగంలో మరో మైలురాయి సాధించబడింది. గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ చేపట్టిన డ్రైన్ ఎండ్ సోక్ పిట్ నిర్మాణం(Drain and Soak Pit Project) విజయవంతంగా పూర్తయింది.

గ్రామ సర్పంచ్ నతీ సురేష్ ఆధ్వర్యంలో మండల టీమ్ సహకారంతో చేపట్టిన ఈ వినూత్న పారిశుద్ధ్య కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, మండల టీమ్ చూపుతున్న చొరవను నిరంతరం శ్రమిస్తున్న తీరును కలెక్టర్ గారు అభినందించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నతీ సురేష్ మాట్లాడుతూ.. గ్రామాన్ని ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ఈ పనులను గుర్తించి ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.  తమ గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న మండల టీమ్‌కు, అధికారులకు,  గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ భారత్ నినాదానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందరి సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేస్తామని వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు