ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన
ఎర్రుపాలెం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్నినో (El Niño) ప్రభావం నేపథ్యంలో నీటి వనరులను సంరక్షిస్తూ, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను (Alternative Crops) ఎంచుకోవాలని రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తక్కెళ్లపాడు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడంపై అధికారులు, నాయకులు రైతులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ ముక్కర రామకృష్ణ రెడ్డి, పీసీసీ సభ్యులు శీలం ప్రతాప్ రెడ్డి, ఉపసర్పంచ్ కూరపాటి రమేష్, ఏఈఓ సిందూర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పరిపాలన అధికారి రమేష్, మాజీ ఎంపీటీసీ ముక్కర చిన్న లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అయిలూరి రవీంద్ర రెడ్డి, వార్డు సభ్యులు తలపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, తలుపుల విజయ్ బాబు, వరుణ్ కుమార్, రైతు నాయకులు, పంచాయతీ సిబ్బంది, సొసైటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.