ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

11-09-2026 | 03:58pm

* డీజేలు పెడితే కఠిన చర్యలు

* ఎస్సై నాగన్న

భూత్పూర్, సెప్టెంబర్ 11(విజయ క్రాంతి) : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై నాగన్న(SI Naganna)తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గణేష్ మండపాలను పెడుతున్న యువకులు తప్పకుండా పోలీస్ శాఖ వారి అనుమతులు తీసుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనం రోజు డీజేలకు ఎలాంటి పర్మిషన్లు లేవని, ఎవరైనా డీజేలు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

గణేష్ మండపాల వద్ద సాధారణ సౌండ్ సిస్టం కు మాత్రమే అనుమతి ఉంటుందని, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మాత్రమే సౌండ్ సిస్టం ను వినియోగించుకోవాలని తెలిపారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముడావత్ బాలకోటి,  ఎస్సై 2 దివ్య రెడ్డి, కౌన్సిలర్లు పద్మ,  శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు తో పాటు యువకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు