విద్య.. ఆలయాల అభివృద్ధికి రూ.11 కోట్లు

11-09-2026 | 05:44pm

ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో నిధుల మంజూరు

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గ(Wanaparthy Constituency) అభివృద్ధిలో భాగంగా విద్య, ఆలయాల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. చిట్యాలలోని బీసీ బాలుర జూనియర్‌ కళాశాల(BC Boys Junior College) భవన నిర్మాణానికి రూ.10 కోట్లు, మంగంపల్లి ఆలయాల అభివృద్ధికి రూ.కోటి మంజూరయ్యాయి.

 చిట్యాల కళాశాలకు రూ.10 కోట్లు

వనపర్తి మండలం చిట్యాలలోని ఎంజేపీటీబీసీర్ బాలుర జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి జీఓఆర్టి నెంబర్ .93 ద్వారా రూ.10 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Thudi Megha Reddy) ప్రత్యేక చొరవతో నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణాన్ని టీజీఈడబ్ల్యూ ఐడీసీ  ద్వారా చేపట్టనున్నారు. గ్రామీణ బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ భవనం దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

 మంగంపల్లి ఆలయాలకు రూ.కోటి

పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి SDF 2026–27 కింద జి .ఓ  ఆర్ టి నెంబర్ .203 ద్వారా రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. తన స్వగ్రామ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు