షాదీఖానా నిర్మాణానికి 39 గుంటల ప్రభుత్వ భూమి కేటాయింపు

16-10-2026 | 10:13pm

కలెక్టర్ ఉత్తర్వుల ప్రతులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అందజేత

మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): నగరంలో షాదీఖానా నిర్మాణం కోసం కోయిల్‌కొండ రోడ్డులోని సర్వే నంబర్ 946లో 39 గుంటల ప్రభుత్వ భూమిని(Government land) కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా(District Collector Khushboo Gupta) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్‌ఐ సుదర్శన్ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విష్ణువర్ధన్ గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. షాదీఖానా నిర్మాణంతో మైనారిటీ వర్గాల ప్రజలకు వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అవసరమైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఆల్ మేవా అధ్యక్షుడు షేక్ ఫరూఖ్ హుస్సేన్, తఖీఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు