ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
16-10-2026 | 10:15pm
మహబూబ్నగర్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(Government General Hospital) దేవాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా(Ranga Ajmera) ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంవోలు డాక్టర్ శిరీష్, డాక్టర్ ఉమలతతో పాటు వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.