ఒక్క గంట .. క్లీన్, గ్రీన్ పాలమూరు!
01-10-2026 | 01:08pm
మహబూబ్నగర్, అక్టోబర్ 1: చారిత్రక పిల్లలమర్రి ప్రాంగణంలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation)ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హీ సేవా–2026’లో భాగంగా ‘ఏక్ తారీఖ్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ శ్రమదానం నిర్వహించారు. మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్(Mayor Gummala Mamata Srinivas)దిరాజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించారు.
కార్యక్రమంలో కమిషనర్ రామానుజల రెడ్డి, కార్పొరేటర్ మేగ్య నాయక్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఎస్బీఐ ప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ పిలుపునిచ్చారు.