గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

16-10-2026 | 10:01pm

24 గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో మండల వైద్యాధికారి మీర్జా

మిడ్జిల్, అక్టోబర్ 16 : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు(Medical Services) అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మిడ్జిల్ మండల(Midjil Mandal) వైద్యాధికారి మీర్జా తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్య సేవలు అందించేందుకు 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించాలని సూచించారు.

అర్హతలకు మించి చికిత్సలు అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుభవం, అర్హతలు లేని వారి వద్ద చికిత్స పొందితే ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి మీర్జా కోరారు.

మరిన్ని వార్తలు