5 September, 2026 | 1:48 PM

నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం

05-09-2026 | 12:34pm

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్‌ (విజయక్రాంతి): ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను(MVS Government Degree College) అత్యాధునిక వసతులతో తెలంగాణలోనే నంబర్‌వన్‌ విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కళాశాల నూతన భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. ఎంవీఎస్ కళాశాల అభివృద్ధికి మొత్తం రూ.70 కోట్లతో సమగ్ర ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. తొలి విడతగా రూ.20.50 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నామని, మిగిలిన నిధులను దశలవారీగా సమకూరుస్తామన్నారు. ప్రస్తుతం సుమారు 3,500 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

బాలికల హాస్టల్‌, గ్రౌండ్‌ అభివృద్ధి పనులతో పాటు ఎంవీఎస్ జూనియర్‌ కళాశాలలో రూ.15 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ తరహా విద్యా సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. మొత్తం ఎంవీఎస్‌ ప్రాంగణాన్ని విద్యా హబ్‌గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్‌ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌ మారేపల్లి సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి, కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు