అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్
చిన్నారులకు పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
గండీడ్, నవంబర్ 6 (విజయక్రాంతి): మండల పరిధిలోని వెన్నచేడ్: గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య(Sarpanch Gurrala Navaneetha Chennaiah) సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్‌తో మాట్లాడి చిన్నారులకు ప్రతిరోజూ అందిస్తున్న పౌష్టికాహారం, ఆహార మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులకు సమతుల్యమైన పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని సర్పంచ్ పేర్కొన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు చిన్నారుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులని, వారి ఆరోగ్యం, ఎదుగుదల మనందరి బాధ్యత అని సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య తెలిపారు.