గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా గ్రామసభలు

02-10-2026 | 08:21pm

భీమిని, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని పలు గ్రామపంచాయతీలలో(Gram Panchayats) గాంధీ జయంతి సందర్బంగా శుక్ర వారం సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామసభలు నిర్వహించారు. వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీన్ పథకంలో  భాగంగా ఆయా గ్రామాలకు అవసరమైన పనులను గుర్తించారు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబందించి గ్రామపంచాయతీ ప్రణాళిక సిద్ధం చేశారు.

(స్వచ్ఛత హి సేవ) కార్యక్రమం ద్వారా చెపట్టిన కార్యక్రమాలు వివరించారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీల్లో బాల్య వివాహలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి  ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, ఏపీఎం బ్రహ్మయ్య, ఏపీవో సత్య ప్రసాద్, గ్రామ సర్పంచులు బండి శ్రీకాంత్ గౌడ్, రామ్ టెంకి దశరథ్, భీమ్ రావు , ఉప సర్పంచులు బోనగిరి లోహిత్ గుప్తా, కార్యదర్శులు శోభన్ బాబు, ఉపాధి కూలీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు