వంద పడకల దవాఖానలో కరువైన వీల్ చైర్

24-10-2026 | 08:46pm

70 ఏళ్ల వృద్ధురాలిని మోసుకెళ్లిన మనవడు.

అచ్చంపేట, అక్టోబర్ 24 : వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో(100-bed government hospital) వీల్‌చైర్‌, స్ట్రెచర్‌ అందుబాటులో లేకపోవడంతో 70 ఏళ్ల వృద్ధురాలిని(Elderly woman) ఆమె మనవడు చంకనెత్తుకుని వైద్యుడి(Doctor's) వద్దకు తీసుకెళ్లిన ఘటన అచ్చంపేటలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో(Video social media) వైరల్‌ కావడంతో ఆస్పత్రిలో కనీస సౌకర్యాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా సింగారం గ్రామానికి చెందిన డెబ్భై ఏళ్ల వయసు గల వర్ధం జంగమ్మ అనారోగ్యంతో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో ఆమె మనవడు ఆంజనేయులు గురువారం అచ్చంపేట ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆటో దిగిన తర్వాత ఓపీడీ విభాగానికి వెళ్లేందుకు వీల్‌చైర్‌, స్ట్రెచర్‌ కోసం ప్రయత్నించినా సాయం అందలేదని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో చేసేదిలేక వృద్ధురాలిని సుమారు 150 మీటర్ల దూరం చంకనెత్తుకుని తీసుకెళ్లాడు. వంద పడకల ఆస్పత్రిలో వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులు, ప్రమాద బాధితులకు అవసరమైన కనీస సౌకర్యాలు అందుబాటులో లేవా ఉన్నా రోగులకు ఎందుకు అందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ జరిపి, వీల్‌చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉంచడంతోపాటు రోగులకు సహాయం చేసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు