మౌలిక వసతులకి నిధులు

24-10-2026 | 08:46pm

పాపన్నపేట: నార్సింగిలోని 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.25.87 లక్షల నిధులు మంజూరయ్యాయని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి(Former MLA Shashidhar Reddy) తెలిపారు. శనివారం స్థానిక విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (TGSPDCL) ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు.

మెదక్‌ డివిజన్‌, పాపన్నపేట సబ్‌డివిజన్‌ పరిధిలోని నార్సింగి విద్యుత్‌ ఉపకేంద్రం(Narsingi Power Substation)లో సింగిల్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణం, గేటు పిల్లర్లతో కూడిన బయటి ఫెన్సింగ్‌, అంతర్గత ఫెన్సింగ్‌ ఏర్పాటు, స్విచ్‌యార్డులో మెటల్‌ వేయడం, సీఆర్‌ఎస్‌ రైజింగ్‌ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనుల కోసం మొత్తం రూ.25,87,967 నిధులను 18 శాతం జీఎస్టీతో కలిపి క్యాపిటల్‌ వర్క్స్‌ బడ్జెట్‌ కింద కేటాయించినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి TGSPDCL ఉత్తర్వు నంబరు SP.O.O. (Capital Works) Ms. No. 1913 జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో ఉపకేంద్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయని శశిధర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు