సబ్సిడీ విత్తనాల పంపిణీ
27-10-2026 | 06:34pm
హాజీపూర్, అక్టోబర్ 27 : జాతీయ ఆహార భద్రత, పోషక పథకం(Nutrition Scheme) ఆత్మ నిర్భారత పథకం(Self-Reliance Scheme) కింద సబ్సిడీ విత్తనాలను జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ పంపిణీ చేశారు. మంగళ వారం గుడిపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మినుములు ( వీ బీ ఎన్ 10 వెరైటీ), పెసర (మధిర ఎం జీ జీ-385 వెరైటీ) లను రైతులకు సబ్సిడీ పై పంపిణీ చేశారు.
4 కిలోల బస్తాకి పూర్తి ధర 580 రూపాయలు, రైతుకి 100 రూపాయలకి సబ్సిడీ ధరతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏ డి ఏ మామిడి క్రిష్ణ, టెక్నికల్ ఏ డి ఏ గోపి, హాజీపూర్ ఏఓ క్రిష్ణ, ఏ ఈ ఓ మధుప, రైతులు తదితరులు పాల్గొన్నారు.