మంచిర్యాల జిల్లా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆవిర్భావం

01-11-2026 | 10:53pm

అధ్యక్షుడిగా ప్రదీప్, ఉపాధ్యక్షుడిగా ఉదయ్ ఏకగ్రీవ ఎన్నిక

నస్పూర్/మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ఆదివారం (01-11-2026) క్రైస్తవ యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో "మంచిర్యాల క్రిస్టియన్ యూత్ అసోసియేషన్(Mancherial Christian Youth Association)" నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సంఘ నూతన అధ్యక్షుడిగా ప్రదీప్, ఉపాధ్యక్షుడిగా ఉదయ్‌తో పాటు జనరల్ బాడీ సభ్యులను సభ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులను, ఇతర కార్యవర్గ సభ్యులను పలువురు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం సంఘ అధ్యక్షుడు ప్రదీప్ మాట్లాడుతూ.. యువత అంతా ఐక్యంగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రైస్తవ యువతలో ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడం, పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, యువత ఉన్నతికి తోడ్పడటమే అసోసియేషన్ ముఖ్య లక్ష్యమని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో పలు సేవా, సాంఘిక కార్యక్రమాలను సమన్వయంతో చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు