అక్రమ మద్యం దందాపై పోలీసుల దాడులు
మంచిర్యాల క్రైమ్ (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని వడ్డెర కాలనీలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురిపై పోలీసులు దాడులు (Raids) నిర్వహించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం (Seized) చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆది మధుసూదన్, పోలీసు సిబ్బంది తనిఖీలు (Inspections) చేపట్టారు.
ఈ తనిఖీల్లో వడ్డెర కాలనీకి చెందిన ఒల్లెపు కుమార్, గౌతమినగర్‌కు చెందిన యైదా లక్ష్మణ్, వడ్డెర కాలనీకి చెందిన ఎడగొట్టు పున్నం, వల్లెపు సాయికుమార్ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు నలుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, తదుపరి చట్టపరమైన చర్యలు (Legal Action) చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ హెచ్చరించారు.