ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం
ఇది పాలనా… లేక అప్రకటిత ఎమర్జెన్సీ దుశ్చర్యనా?
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూకంటి రాజాగౌడ్.
చేగుంట అక్టోబర్ 11, : ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నడిరోడ్డుపై నిలువునా గొంతు నులిమేస్తున్నారు! ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తూ, శాంతియుతంగా నినదించే యువతను నిర్బంధిస్తూ సాగిస్తున్న ఈ అణచివేత చర్యలను యావత్ భారతావని అత్యంత తీవ్రంగా, ముక్తకంఠంతో ఖండించాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జూకంటి రాజాగౌడ్(Medak District Congress Party General Secretary Jukanti Raja Goud) పేర్కొన్నారు.
దేశ రాజధానిని ఏకంగా ఒక నిర్బంధ సైనిక శిబిరంగా మార్చేశారు. 57 మెట్రో స్టేషన్ల తలుపులు మూసివేసి, సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్న తర్వాత కూడా ఇంకా 40 స్టేషన్లలో రాకపోకలను స్తంభింపజేయడం సిగ్గుచేటు కాదా? నార్తర్న్ రైల్వే పరిధిలో 38 రైళ్లను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి సామాన్య ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు .