కాంగ్రెస్ నాయకుల అక్రమాలు జోరు

08-10-2026 | 06:45pm
  1. మట్టిని, గుట్టలను అమ్ముకుంటున్న కాంగ్రెస్ పెద్దలు
  2. గిరిజనుల భూములను కబ్జా చేస్తున్నారు
  3. రోజుకోక్క అక్రమాలు బయటకు వస్తున్నాయి..
  4. కాంగ్రెస్ ను ప్రజలే బొంద పెడతారు
  5. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
  6. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం కోసం నడుం బిగించాలి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, అక్టోబర్ 8(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమాలు రోజుకోక రూపంలో బయటకోస్తున్నాయని, మట్టిని, గుట్టలను అమ్ముకుంటున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar) ఆరోపించారు. గిరిజన బిడ్డల భూములను కబ్జా చేస్తున్నారని, గిరిజనులు మొత్తుకుంటున్నా, గొడవ చేస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతల తీరుతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థీని మంచి మెజారిటీతో గెలిపిస్తారని జోస్యం చెప్పారు. రాబోయే పట్టభద్రుల ఖమ్మం, నల్గొండ,వరంగల్ (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థి విజయం కోసం ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేయాలని  పార్టీ శ్రేణులకు  పిలుపునిచ్చారు. గురువారం 

ఖమ్మంలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో దాదాపు ప్రస్తుతం 28,500 ఓట్లు ఉన్నాయని, ప్రతి 100 ఓట్లకు ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్) చొప్పున అదనంగా 325 మందికి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే  తరహాలోనే ఈసారి కూడా ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రుల వివరాలు సేకరించాలన్నారు. 

డివిజన్ల వారీగా ప్రత్యేకంగా టెంట్లు, గుడారాలు, లేదా పార్టీ కార్యాలయాల వద్ద ఎన్‌రోల్‌మెంట్ క్యాంపులు ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియను ఉధృతం చేస్తున్నామని చెప్పారు. తానూ స్వయంగా వచ్చే నెల రోజుల్లో కనీసం వారానికి రెండు రోజులు ఈ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటానని ప్రకటించారు.

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వైద్యులు, న్యాయవాదులు, బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు, డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను గుర్తించి ప్రత్యక్షంగా కలిసి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీందర్ రావు, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్ కుమార్,

పగడాల నాగరాజు, ఖమర్,మాజీ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, షేక్ మక్బుల్, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల కోటేశ్వరరావు, జ్యోతి రెడ్డి, పల్లా రోజ్లీనా,కమల, బుడిగం శ్రీను, బుర్రి వెంకటేశ్వర్లు,బిక్కసాని ప్రశాంతిజస్వంత్,పసుమర్తి రామ్మోహన్, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, నాయకులు మెంతుల శ్రీశైలం, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు