కోర్టు కు హాజరైన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్

08-10-2026 | 06:42pm

ఖమ్మం, అక్టోబర్ 8(విజయ క్రాంతి): కేంద్ర లోని బీజేపీ ప్రభుత్వం(BJP government), రాష్ట్రంలోని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు(BRS governments) అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 2022 సంవత్సరం లో పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు..

దీంతో ఆనాటి ప్రభుత్వం ఆయన తో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది..ఆ కేసు కోసం ఈరోజు ఖమ్మం జిల్లా కోర్టు కు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరైనారు..వారితో పాటు మందడీ హిజ్రయిల్,పత్తి నాగేశ్వరరావు,పాపా నాయక్,పోట్ల కిరణ్,సాగర్ రెడ్డి,బాజా సత్యనారాయణ,యడవల్లి నాగరాజు,గుగులోతు మోహన్,బత్తుల రమేష్ తదితరులు హాజరయ్యారు...

మరిన్ని వార్తలు