బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
16-09-2026 | 06:09pm
చేగుంట సెప్టెంబర్ 16, (విజయక్రాంతి): చేగుంట మండలంలోని మక్కరాజ్ పేట గ్రామానికి చెందిన కర్రె రమేష్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని, బుధవారం వారి సగృహం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy). ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, బి.కొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రాజిరెడ్డి, చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి, మక్కరాజ్ పేట సర్పంచ్ రేఖ సురేష్ రెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, కుమ్మరి శ్రీను, మోహన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.