అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీని ప్రారంభించిన నెఫ్రోప్లస్

16-09-2026 | 07:59pm

హైదరాబాద్, 10 సెప్టెంబర్ 2026: ఆసియాలోనే అతిపెద్ద డయాలిసిస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన నెఫ్రోప్లస్(NephroPlus), డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను తయారు చేసి, వారికి దేశ, విదేశాల్లో మంచి కెరీర్ అవకాశాలు కల్పించే ఉద్దేశంతోనెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీను ఈరోజు ప్రారంభించింది.

ఈ కార్యక్రమం ద్వారా భారత్ మరియు ఫిలిప్పీన్స్‌లో నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారిని డయాలిసిస్ చికిత్సలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, ఈ రంగంలో కెరీర్‌కు మరియు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధం చేస్తారు.దీనికి సంబంధించిన మొదటి శిక్షణా కేంద్రాన్ని ఈరోజు హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న నెఫ్రోప్లస్ ప్రత్యేక డయాలిసిస్ కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెఫ్రోప్లస్ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రోహిత్ సింగ్ హాజరయ్యారు.

అకాడమీకి సంబంధించిన రెండో శిక్షణా కేంద్రాన్ని నవంబర్ 2026లో ఫిలిప్పీన్స్‌లోని క్వెజోన్ సిటీలో ప్రారంభించనున్నారు.డయాలిసిస్ మరియు కిడ్నీ సంరక్షణలో ప్రత్యేక శిక్షణ పొందిన, ఇతర దేశాల్లో కూడా పనిచేయగల నర్సులను తయారు చేయడానికి ఒక క్రమబద్ధమైన శిక్షణా కార్యక్రమంగా రూపొందించారు. ఇందులో తరగతి గది ద్వారా శిక్షణ, ప్రాక్టికల్ శిక్షణ, అనుభవజ్ఞుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లో పనిచేసే అవకాశం, మార్గదర్శకత్వం, ధ్రువపత్రాలు పొందేందుకు సహాయం, అలాగే విదేశాల్లో ఉద్యోగం మరియు అక్కడ పనిచేయడానికి అవసరమైన అనుమతులు, పరీక్షలకు సిద్ధం చేయడం వంటి అంశాలు ఉంటాయి.

ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అర్హత ఉన్న అభ్యర్థులను, వారికి వర్తించే అన్ని నిబంధనలు మరియు శిక్షణలో చేరే సమయంలో అంగీకరించిన పని బాధ్యతలకు అనుగుణంగా, నెఫ్రోప్లస్ విదేశీ కేంద్రాల్లో పనిచేసేందుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.భారత్‌లో కొత్తగా నర్సింగ్ చదువు పూర్తి చేసిన వారికి అందించే కార్యక్రమం 24 నెలల పాటు ఉంటుంది. మొదటి మూడు నెలల్లో తరగతి గది శిక్షణతో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 21 నెలల పాటు నెఫ్రోప్లస్ కేంద్రాల్లో అనుభవజ్ఞుల పర్యవేక్షణలో ప్రత్యక్షంగా పనిచేస్తూ శిక్షణ పొందుతారు.

మరిన్ని వార్తలు