5 September, 2026 | 11:56 AM

చిలుముల విట్టల్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం

05-09-2026 | 11:16am

నర్సాపూర్‌ సెప్టెంబర్ 04: కీర్తిశేషులు చిలుముల విట్టల్‌రెడ్డి(Chilumula Vittal Reddy) 110వ జయంతి సందర్భంగా నర్సాపూర్‌లో శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చిలుముల సుహాసిని రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మురళి యాదవ్‌, రఘువీరారెడ్డి తదితరులు విట్టల్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నర్సాపూర్‌ నియోజకవర్గ(Narsapur Constituency) అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం విట్టల్‌రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన విట్టల్‌రెడ్డి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని, ప్రజాసేవలో ఆయన చూపిన మార్గంలో కొనసాగుతామని సుహాసిని రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ(MPP) నర్సింగ్‌రావు, మాజీ సర్పంచ్‌ రమణారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు