5 September, 2026 | 12:56 PM

ఆదర్శ పంచాయతీగా చిన్నచింతకుంటే లక్ష్యం

05-09-2026 | 11:30am

మహిళా ప్రజాప్రతినిధుల రాష్ట్రస్థాయి శిక్షణలో పాల్గొన్న సర్పంచ్‌

నర్సాపూర్‌, సెప్టెంబర్‌ 04: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట(Chinnachintakunta) గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ప్యాట సరిత మహేష్‌గౌడ్‌ హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీఐ(HRDI)లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

గ్రామసభల సమర్థ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, సమాచార హక్కు చట్టం, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. శిక్షణలో పొందిన అవగాహనను గ్రామ పాలనలో అమలు చేస్తూ, ప్రజల భాగస్వామ్యంతో చిన్నచింతకుంటను ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సర్పంచ్‌ సరిత మహేష్‌గౌడ్‌(Mahesh Goud) తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధులు స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ స్థానిక పాలనలో సమర్థవంతమైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని శిక్షణలో వివరించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు