ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం

24-11-2026 | 08:16pm

పరిశీలించిన జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్లయ్య

తూప్రాన్, నవంబర్ 24, (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపాలిటీ(Tupran Municipality) పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్లయ్య పరిశీలించారు.

ఈ సందర్భంగా ఫేజ్ 1 లో భాగంగా 10,11,12,14 మరియు 16వ వార్డులలో నిర్వహిస్తున్న దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల వివరాల నమోదు, ఆధార్, రేషన్ కార్డు వివరాల ధృవీకరణ ప్రక్రియను సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని,

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందికి సూచించారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నమోదు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ మొదటి రోజు నుండి 3వ రోజు వరకు 562 దరఖాస్తుల నమోదు జరిగినాయని కమీషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ఇందులో ఎంపీడీవో శాలిక, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు