జ్వాలా తోరణం వేడుకలు ప్రారంభించిన ఎమ్మెల్యే రమణారావు సతీమణి

24-11-2026 | 08:14pm

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు 

సుల్తానాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో గల సాంబశివ దేవాలయంలో, శ్రీ శివాలయంలో  ఏర్పాటుచేసిన జ్వాలా తోరణం వేడుకలు ను  మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chinthakunta Vijaya Ramana Rao) సతీమణి  పావని ప్రారంభించారు, దేవాలయాల చైర్మన్లు పల్ల మురళీధర్, అల్లెంకి సత్యనారాయణ, అర్చకులు సామిత్రి శ్రావణ్ కుమార్, పారువెళ్ల రమేష్ శర్మ, బిట్టు,  వల్లకొండ మఠం రమేష్, మహేష్ లు పాల్గొన్నారు.

శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో పల్లకిషన్ కుమారుడు కోడలు సుమ మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో 20,116 కార్తీకదీపలు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే సతీమణి పావని ప్రారంభించారు, ఈ దీపాలు భక్తులను  ఎంతగానో ఆకట్టుకున్నాయి,ఈ సందర్భంగా విజయ రమణారావు సతీమణి పావని నీ ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, పలువురు ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,

మరిన్ని వార్తలు