అంబేద్కర్ సంఘాల బలోపేతానికి సన్నాహక సమావేశం

11-10-2026 | 08:23pm

ఘట్ కేసర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : పోచారం డివిజన్(Pocharam Division) పరిధిలోని నారపల్లి అంబేద్కర్ సంఘం కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం అంబేద్కర్ సంఘాల సీనియర్ నాయకులు(Senior leaders of Ambedkarite organizations), వివిధ గ్రామాల సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో అంబేద్కర్ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు, అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు సాగాలనుకునే ప్రతి ఒక్కరినీ కలుపుకొని సంఘాలను మరింత బలోపేతం చేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

డివిజన్ స్థాయిలో హడక్ కమిటీని ఏర్పాటు చేసి, దాని ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా ఈ నెల 25న తిరిగి నారపల్లి అంబేద్కర్ సంఘం కమ్యూనిటీ హాల్‌లో అంబేద్కర్ సంఘాల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. 

ఈకార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు కిన్నెర రవీందర్, మంద స్వామి దాస్, ఎనుతుల నాగేష్, నాగులపల్లి శ్రీనివాస్, మోటుపల్లి శ్రీనివాస్, మోటుపల్లి పాండు, దయ్యాల ఆంజనేయులు, అయోధ్య, జై భీమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్, నారపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మోటుపల్లి ప్రదీప్, గ్రామ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు