దసరా నేపథ్యంలో మహిళలకు చీరల పంపిణీ
ఉప్పల్ అక్టోబర్ 08విజయక్రాంతి : రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గం (Uppal Constituency)శక్తి సాయినగర్ డివిజన్ పరిధిలోని చాణిక్యపురి కాలనీలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాణిక్యపురి కాలనీలోని శ్రీ పోచమ్మ దుర్గామల్లేశ్వరి స్వామి దేవాలయంలో బిఆర్‌ఎస్ నాయకులు హమాలి శీనన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారుదసరా పండుగ నేపథ్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందజేయడం ద్వారా వారితో సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి కాలనీ మహిళలు, స్థానికులు హాజరై చీరలను స్వీకరించారు.
స్థానికంగా నిర్వహించే పండుగ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు, పరస్పర ఆత్మీయత, సోదరభావం మరింత బలపడుతుందని నిర్వాహకులు హమాలి శీనన్న పేర్కొన్నారు. దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దశరథ్, కార్యదర్శి కిషోర్ గౌడ్, కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ గంధమల్ల రాములు, విజయ తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులు కార్యక్రమంలో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు.