చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి..
కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్..
తాడ్వాయి,అక్టోబర్, 08( విజయ క్రాంతి ): భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్(Chief Election Commissioner of India Gyaneshwar Kumar) రాజీనామాచాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరికొందరు ఎంపీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎంపీలను దౌర్జన్యంగా అరెస్టు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల హక్కుల కోసం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు,వర్కింగ్ ప్రెసిడెంట్ లు షౌకత్ అలీ,రాజీవ్ కుమార్, తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రావు, నాయకులు శ్రీకాంత్, రాఘవేందర్ గౌడ్, సిద్ధిరామిరెడ్డి,దశరథ్ తదితరులు పాల్గొన్నారు.