నర్సయ్యకు కలెక్టర్ ఆర్థిక సాయం

08-10-2026 | 05:14pm

అభినందించిన సర్పంచ్ ఆంజనేయులు 

ముస్తాబాద్,అక్టోబర్ 08( విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కాంపెల్లి నర్సయ్యకు జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్(District Collector Garima Agarwal) ఆర్థిక సాయం అందజేశారు.గురువారం ముస్తాబాద్ తహసిల్దార్ ఫారూక్ తమ కార్యాలయంలో 50 వేల రూపాయల విలువ గల చెక్కును గ్రామ సర్పంచ్ బొమ్మేన ఆంజనేయులు ఆధ్వర్యంలో నర్సయ్యకు అందించారు.

గత 25 సంవత్సరాలుగా చీకోడు గ్రామంలో త్రాగునీరు నల్లా ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్నారు.అతనికి నలుగురు కూతుళ్లు ఉన్నారు.ఆర్థిక భారంతో కుటుంబాన్ని పోషిస్తున్న నర్సయ్య కుటుంబానికి జిల్లా కలెక్టర్ ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని సర్పంచ్ ఆంజనేయులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంజిత్ వార్డు సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు