ఓటు చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ బ్లాక్ డే నిరసన..
ఆలేరు, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా సవరణ(Revision of the voters' list), ఎన్నికల ప్రక్రియలో(Election process) పారదర్శకతపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో బ్లాక్ డే నిరసన నిర్వహించారు. ఢిల్లీలో నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు.
ఈ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్, PACS చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమాల అశోక్, పట్టణ అధ్యక్షుడు కట్టగముల సాగర్ రెడ్డి, నీలం పద్మ, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.