గుంతల రోడ్లు అధికారుల కళ్లకు కనబడడం లేదా!

08-10-2026 | 05:24pm

కొల్లాపూర్ అక్టోబర్ 8: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని(Kollapur Mandal Headquarters) రామాపురం బీటీ రోడ్డు గుంతలు బడి అద్వానంగా మారిందని స్థానికుల ఆరోపిస్తున్నారు. నిత్యం రహదారి పైన పెబ్బేరు టు కొల్లాపూర్. కర్నూల్ బస్సులు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డుపై వందలాది మంది సైకిల్ మోటార్స్ తిరుగుతా ఉంటారు.

రామాపురం గ్రామంలో గుంతలు పడి బస్సులు లారీలు వచ్చినప్పుడు దుమ్ము విపరీతంగా రావడంతో ఆ దుమ్ముకు  తట్టుకోలేక పోతున్నామని ప్రజలు ఊపిరి పీల్చుకోలేక దుమ్ములో ఆగమాగం అయితున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. రామాపురం లో బీటీ రోడ్డుపైన ఉన్న గుంతలను తక్షణమే పూడ్చి రోడ్డు  మరమ్మతులు చేపట్టి ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు