కీసర సిఐగా ఎలక్షన్ రెడ్డి
16-10-2026 | 10:07pm
మేడ్చల్, అక్టోబర్ 16(విజయ క్రాంతి): కీసర సీఐగా ఎలక్షన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి(Police Commissioner Sumathi) ఉత్తర్వులు జారీ చేశారు. నెలరోజుల క్రితం ఇక్కడ పనిచేసిన సీఐ, ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అప్పటినుంచి డి ఐ రమేష్ ఇన్చార్జిగా వ్యవహరించారు. డి ఐ రమేష్ నుంచి ఎలక్షన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎలక్షన్ రెడ్డి కంటోన్మెంట్ ఎస్ వో టీ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.