క్షేత్రస్థాయిలో పార్టీ... బలోపేతానికి నిరంతర కృషి..
అభివృద్ధికి చిరునామా జాతీయ కాంగ్రెస్ పార్టీ...
జవహర్ నగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా సోమేశ్వర చారి నియామకం...
జవహర్ నగర్, నవంబర్ 24 (విజయక్రాంతి): జవహర్ నగర్ పరిధిలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణలో అభివృద్ధికి చిరునామాగా కాంగ్రెస్ పార్టీ మారిందని జవహర్ నగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాసోజు సోమేశ్వర చారి(Kasooju Someshwara Chari) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా కాసోజు సోమేశ్వర చారి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా నియమితులైన కాసోజు సోమేశ్వర చారి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివ చరణ్ రెడ్డిని మంగళవారం మర్యాదగాపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు మేడ్చల్ ఇన్చార్జి నాగరాజు కూడా కలిసి నియామక వివరాలను తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమేశ్వర చారి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మాట్ల క్రాంతి కుమార్, నాయకులు ఇసాక్, జగదీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.