సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

24-11-2026 | 07:31pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల పవిత్ర గోదావరి నది(Godavari River) తీరంలోని గౌతమేశ్వర రమా సహిత సత్యనారాయణ స్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మంగళవారం మంచిర్యాల వాసవి క్లబ్స్(Mancherial Vasavi Clubs) ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు.

నాలుగు సంవత్సరాలుగా ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. కాగా 48వ మాసం సామూహిక సత్యనారాయణ స్వామి రథాలలో 48 జంటలు పాల్గొన్నాయి. వేద పండితులు గడియారం బాలాజీ శర్మ, నిర్వాహకులు పడకంటి శ్రీనివాస్, గోపగాని శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ సామూహిక సత్యనారాయణ నిర్వహించి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు.

ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం రాజేష్, శ్రీనివాస్, గవర్నర్ బాలమోహన్, క్యాబినెట్ సెక్రటరీ సేవా కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి వెంకటేష్, పిఆర్ఓ రమేష్, రీజియన్ చైర్మన్ మధుశ్రీ, జోన్ చైర్మన్ శ్రీనివాస్, సూర్యనారాయణ, వివిధ వాసవి క్లబ్ల అధ్యక్షులు పడకంటి రజిత, రాజేంద్రప్రసాద్, వినిశెట్టి రాఘవేంద్ర, ముక్తా విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు